Under 19 World Cup: అండర్ 19 ప్రపంచ కప్ లో ఫైనల్‌కు చేరిన టీమిండియా!| ABP Desam
వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ 2022 లో టీమ్ ఇండియా ఫైనల్ కు చేరుకుంది. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. అనంతరం 291 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 41.5 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా తో 96 పరుగులతో ఘన విజయం సాధించింది టీమ్ ఇండియా.