Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్

Continues below advertisement

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీతో చెలరేగాడు. ఈ టోర్నమెంట్ లో భాగంగా సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ ముంబై తరపున బరిలోకి దిగాడు. తన విధ్వంసకర బ్యాటింగ్ తో స్టేడియాన్ని హోరెత్తించాడు. రోహిత్ శర్మ కేవలం 94 బంతుల్లోనే 155 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. 

అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న టైంలో బీసీసీఐ సెలెక్టర్ ఆర్పీ సింగ్‌ గ్యాలరీలో నుంచి మ్యాచ్ చూస్తున్నారు. అక్కడున్న అభిమానులు కోచ్ గౌతమ్ గంభీర్‌ను ఉద్దేశించి నినాదాలు చేయడం మొదలు పెట్టారు. “గంభీర్ ఎక్కడున్నావ్? చూస్తున్నావా రోహిత్ ఆటను?” గట్టిగా అరిచారు.

రోహిత్ శర్మ ఇంకా అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడని... అతని తక్కువ అంచనా వేయవద్దని ఫ్యాన్స్ గంభీర్‌కు సోషల్ మీడియాలో వార్నింగ్ ఇస్తున్నారు. ఇకపోతే ఒక దేశవాళీ మ్యాచ్ కోసం సుమారు 20,000 మందికి పైగా ఫ్యాన్స్ స్టేడియానికి రావడం విశేషం. కేవలం రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను చూడడానికి ఎంతోమంది ఫ్యాన్స్ వచ్చారు.“ముంబై చా రాజా రోహిత్ శర్మ” స్టేడియంలో నినాదాలు చేసారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola