Tokyo Olympics: ఎన్ని ఇబ్బందులున్నా.. హాకీటీమ్ లు అద్భుతంగా పోరాడాయి.. చెక్ దే హాకీ.. ముఖేష్ కుమార్
దేశంలో క్రీడా సౌకర్యాలు పెంచకుండా.. క్రీడాకారులకు దండలు వేసి.. సన్మానాలు చేస్తే ఫలితం ఉండదని ట్రిపుల్ ఒలంపియన్, మాజీ హాకీ ఆటగాడు ఎన్.ముఖేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రోత్సాహం అంతంత మాత్రంగానే ఉన్నా.. ఒలంపిక్స్ లో మన వాళ్లు అద్భుత ప్రదర్శన చూపించారని ప్రశంసించారు. భారత పురుషుల, మహిళల హాకీ జట్లు చాలా ఏళ్ల తర్వాత సెమిస్ లోకి అడుగుపెట్టడంపై ఆయన ఏబీపీ దేశంతో ఆనందాన్ని పంచుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వాలు క్రీడా సౌకర్యాలు కల్పించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సమీపంలో సదుపాయాలు లేకపోవడం వల్లే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను క్రీడారంగంవైపు పంపడం లేదన్నారు. తాము కూడా అదే పనిచేశామన్నారు. గెలిచినప్పుడే గుర్తుంచుకుంటే ఉపయోగం ఏంటని .. దీర్ఘకాలిక ప్రణాళికతో క్రీడల అభివృద్ధిని చేపట్టాలని సూచించారు. ఎన్ని ఇబ్బందులున్నా.. హాకీటీమ్ లు అద్భుతంగా పోరాడాయని ప్రశంసించారు.