Tilak Varma Innings Ind vs SA T20 | అహ్మదాబాద్‌లో రెచ్చిపోయిన తిలక్ వర్మ

Continues below advertisement

భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమ్ ఇండియా బ్యాట్స్మన్ తిలక్ వర్మ విధ్వంసం సృష్టించాడు. మ్యాచ్ మొదటి నుంచే వచ్చిన బ్యాట్స్మన్ వచ్చినట్టుగా రన్స్ ను స్కోర్ చేసి .. భారీ స్కోర్ దిశగా అడుగులు వేశారు. 

కొద్దిసేపటి తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ.. హార్దిక్ పాండ్యాతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ఇద్దరు పోటాపోటీగా బౌండరీలు చేసారు. ఈ ఇద్దరు కలిసి కేవలం 43 బంతుల్లోనే వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

తిలక్ వర్మ 42 బంతులు ఆడి 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 73 పరుగులు చేసాడు. అలాగే హార్దిక్ పాండ్యా 25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 63 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివరి ఓవర్‌లో తిలక్ వర్మ కూడా రనౌట్ అయ్యాడు. 

ఇక శుభమన్ గిల్ స్థానంలో టీమ్ లోకి వచ్చిన సంజు శాంసన్ ... అభిషేక్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మళ్ళి నిరాశపరిచినా కూడా మిగితా బ్యాట్సమన్ అందరు రాణించడంతో టీమ్ ఇండియా భారీ స్కోర్ ను చేయగలిగింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola