Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
వరల్డ్ కప్ కు ముందు టీమ్ ఇండియాకు పెద్ద దెబ్బ తగిలేలా కనిపిస్తుంది. స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ ( Tilak Varma ) అబ్డొమినల్ ఇంజ్యూరీతో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది.
అయితే ఈ గాయం కారణంగా న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్ నుంచి తిలక్ రూల్డ్ అవుట్ అయినట్టుగా తెలుస్తుంది. కానీ అధికారిక ప్రకటన రాలేదు. అలాగే టీ20 వరల్డ్‌కప్‌లో కూడా ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
విజయ్ హజారే ట్రోఫీలో ( Vijay Hazare Trophy ) హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు తిలక్ వర్మ. రాజ్‌కోట్‌లో తిలక్‌కు అబ్డొమినల్ సమస్య వచ్చింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారట. ఆపరేషన్ జరిగితే కనీసం మూడు నుంచి నాలుగు వారాల రికవరీ టైమ్ అవసరం ఉంటుంది. అదే జరిగితే టీ20 వరల్డ్‌కప్ కు కూడా తిలక్ అందుబాటులో ఉండడు. తిలక్ ప్లేస్ లో మరో ప్లేయర్ ను తీసుకోవాల్సి ఉంటుంది. మరి సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.