Tilak Varma in T20 World Cup | వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు అందుబాటులో తిలక్ వర్మ ?

టీమిండియా యంగ్  బ్యాట్స్మన్ తిలక్ వర్మ ( Tilak Varma ) విజయ్ హజారే ట్రోఫీలో ( Vijay Hazare Trophy ) భాగంగా మ్యాచ్ ఆడుతున్నప్పుడు గాయపడ్డాడు. దాంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైయ్యాడు. ఇప్పుడు చివరి రెండు మ్యాచ్‌లకు కూడా దూరంగా ఉండనునట్టు తెలుస్తుంది. 

అయితే టీ20 వరల్డ్‌కప్ 2026కి ( T20 World Cup 2026 ) మాత్రం తాను పూర్తిగా ఫిట్‌గా ఉంటాడని తెలుస్తుంది. గాయంనుంచి కోలుకుంటున్న తిలక్ దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌కు ముందు టీమ్ లో చేరనున్నాడట. 

భారత్ అమెరికా మ్యాచ్ తో ఇండియా వరల్డ్ కప్ జర్నీ మొదలు కానుంది. ఆ మ్యాచ్ కు తిలక్ వర్మ పూర్తిగా సిద్ధంగా ఉంటాడని టీమ్ మేనేజ్‌మెంట్ వర్గాలు భావిస్తున్నాయి. తిలక్ దూరమైన తొలి మూడు టీ20లకు శ్రేయస్ అయ్యర్‌ను ( Shreyas Iyer ) టీమ్ లోకి తీసుకున్నారు. చివరి రెండు మ్యాచ్‌లకూ కూడా అయ్యర్ ను జట్టులో కొనసాగించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కానీ ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola