Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్

టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ.. తన అల్ టైం ఫేవరేట్ హీరో గురించి చెప్పుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి తనకు చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని, ఆయనే తన ఏకైక హీరో అని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. గతేడాది 'మన శంకరవర ప్రసాద్ గారు' సినిమా సెట్స్‌లో చిరంజీవిని కలిసిన తిలక్, ఆ క్షణాన్ని తన జీవితంలో మర్చిపోలేని అన్నాడు. 

ఇక టీ20 ప్రపంచకప్ 2026 విజయం తర్వాత, రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా షూటింగ్ సెట్స్‌కు వెళ్లిన తిలక్ వర్మ.. అక్కడ మెగా పవర్ స్టార్‌ను కలుసుకున్నారు. సినిమా షూటింగ్‌లో వాడిన ఒక పాత క్రికెట్ బ్యాట్‌పై తన ఆటోగ్రాఫ్ చేసి చరణ్‌కు గుర్తుగా ఇచ్చారు. స్పోర్ట్స్ ఎమోషన్స్ ఉన్న సినిమాలంటే తనకు చాలా ఇష్టమని, అందులోనూ 'RRR' లో చరణ్, ఎన్టీఆర్ నటన చూసి ఆశ్చర్యపోయానని తిలక్ చెప్పుకొచ్చాడు. 

తిలక్ వర్మ మెగా ఫ్యామిలీ పట్ల చూపిస్తున్న ఈ అభిమానం చూసి మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ లో సిక్సర్లతో విరుచుకుపడే మన తెలుగు కుర్రాడు, బయట మాత్రం పక్కా మాస్ మెగా అభిమానిగా కనిపిస్తూ అందరి మనసు గెలుచుకుంటున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola