Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

Continues below advertisement

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓటమి అంచుల్లో నిలిచిన జట్టును హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి 69 పరుగుల భాగస్వామ్యంతో గెలుపు తీరాలకు చేర్చారు. ఈ ఇద్దరు తెలుగు కుర్రాళ్లు క్రీజులో ఉండి చేసిన పోరాటం ఒక ఎత్తైతే, ఆ సమయంలో వారు తెలుగులో మాట్లాడుకున్న ముచ్చట్లు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఇన్నింగ్స్ 17వ ఓవర్లో తొలి బంతి తర్వాత స్ట్రైక్‌లో ఉన్న తిలక్ వర్మ.. "నువ్వు కాల్ ఇవ్వలేదు.." అనగానే, నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న నితీశ్ రెడ్డి వెంటనే.. "నువ్వు వచ్చేసేయ్.. నేను వచ్చేస్తా ఆరాంసే" అని బదులిచ్చాడు. దీనికి తిలక్ నవ్వుతూ.. "రేయ్ రెండు అని చెప్పురా పోనీ.. నేను ముందొచ్చి వెయిట్ చేస్తున్నా నీకోసం" అని గట్టిగా అరుస్తూ మాట్లాడిన మాటలు మైక్ స్టంప్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. 

అంతర్జాతీయ వేదికపై, అది కూడా విదేశీ గడ్డపై మన కుర్రాళ్లు ఇలా మాతృభాషలో మాట్లాడుకోవడం క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా వీరిద్దరూ సరదాగా ముచ్చటించుకున్న విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola