నితీష్‌కి బీసీసీఐ అన్యాయం.. మండిపడుతున్న తెలుగు ఫ్యాన్స్
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నవంబర్ 14 శుక్రవారం నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య జరగనున్న తొలి టెస్ట్‌కు ముందు తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డికి బీసీసీఐ షాకిచ్చింది. నితీష్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నప్పటికీ.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ తుది జట్టులో చోటు ఇవ్వడం కష్టంగా మారడంతో ఏకంగా సీరిస్ నుంచే విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బీసీసీఐ డెసిషన్‌పై తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. అయితే డొమెస్టిక్ క్రికెట్లో అదరగొడుతున్న ధృవ్ జురెల్ కోసమే నితీష్ కుమార్ రెడ్డిని టీమ్‌లో నుంచి తీసేసినట్లు తెలుస్తోంది.
ఇంగ్లాండ్ పర్యటనలో రిషబ్ పంత్ గాయపడడంతో అతడి స్థానంలో జురెల్ ఆడాడు. పంత్ గాయం నుంచి కోలుకుని దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికవ్వడంతో జురెల్‌కు ప్లేయింగ్ 11లో ప్లేస్ కష్టమే అనుకున్నారంతా. కానీ తాజాగా ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 127 నాటౌట్, 132 నాటౌట్, 44, 125, 56, 140 స్కోర్లతో జురెల్ అదరగొడుతుండటంతో.. టెస్ట్ సిరీస్ ఫైనల్ ఎలెవెన్‌లో అతడికి ప్లేస్ ఇవ్వాలని బీసీసీఐ డిసైడ్ అయింది.
అయితే జురేల్ రావడంతో నితీశ్ కుమార్ రెడ్డికి ప్లేస్ అడ్జస్ట్ చేయడం కష్టమైపోవడంతోనే జట్టు నుంచి విడుదల చేసినట్లు బీసీసీఐకి చెందిన కొంతమంది అఫీషియల్స్ చెబుతున్నారు. ఇక మెయిన్ టీమ్ నుంచి రిలీజ్ అయిన నితీశ్.. ఇప్పుడు సౌతాఫ్రికా-ఏతో వన్డేలు ఆడబోతున్న భారత్-ఏ జట్టుతో చేరబోతున్నాడు. అయితే జురేల్ కోసం నితీశ్ కుమార్ రెడ్డిని జట్టులో నుంచి తీసేయడంతో తెలుగు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నితీశ్ లాంటి ఆల్‌రౌండర్ టెస్ట్ జట్టులో చాలా అవసరమని, టీమ్‌లో సరైన అవకాశాలు ఇవ్వకుండా అతడిని ఇబ్బంది పెట్టడం దారుణమని అంటున్నారు.