Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ

Continues below advertisement

భారత క్రికెట్ జట్టు ఇటీవల కనబరిచిన ప్రదర్శనలు, ప్లేయర్స్ గాయాల సమస్యలపై చర్చించేందుకు బిసిసిఐ ముంబైలోని ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీకి టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్‌లతో పాటు బోర్డు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో ఎదురైన ఓటములు, గత కొన్ని నెలలుగా జట్టులోని లోపాలపై బోర్డు పెద్దలు చర్చించారు.

ముఖ్యంగా రాబోయే న్యూజిలాండ్ టూర్, ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, 2027 వన్డే వరల్డ్ కప్ సన్నాహకాలకు సంబంధించి రోడ్‌మ్యాప్‌ను ఈ భేటీలో సిద్ధం చేశారు. కోచ్ గంభీర్ వ్యూహాలను అడిగి తెలుసుకున్న బోర్డు, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై కీలక ఆదేశాలు ఇచ్చింది.

కీలక ప్లేయర్స్ వరుస గాయాలు ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా మారాయి. అఫ్గానిస్తాన్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాలను కేవలం ప్రొవిజనల్‌గా మాత్రమే ఎంపిక చేయడం ఫిట్‌నెస్ తీవ్రతను చూపుతోంది. ఫిట్‌నెస్ క్లియరెన్స్ వస్తేనే వీరిని బరిలోకి దించనున్నారు. ప్లేయర్ల రికవరీ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సీవోఈ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌ను బీసీసీఐ ఆదేశించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola