Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ

Continues below advertisement

టీమ్ ఇండియా టెస్ట్ మ్యాచులో గత కొంత కాలంగా విఫలం అవుతూనే ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా సొంతగడ్డపై దారుణంగా ఓడిపోయింది. ఇందుకు కారణం టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ వ్యూహాలే అని ఫ్యాన్స్ మండి పడ్డారు. తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా మాజీ ప్లేయర్స్ నుంచి వచ్చాయి. ఈ నేపథ్యం టెస్టు టీమ్ కోచింగ్ విషయంలో బీసీసీఐ ఆలోచనలో పడిందట. 

మాజీ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్‌ తో బీసీసీఐ పెద్దలు సంప్రదింపులు చేస్తున్నారట. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో హెడ్ ఆఫ్ క్రికెట్‌గా కొనసాగుతున్న లక్ష్మణ్ ఇండియా టెస్టు టీమ్ కు కోచింగ్ చేయడంపై అంతగా ఆసక్తి చూపలేదని అంటున్నారు. 

గౌతమ్ గంభీర్ కు ఐసీసీ, ఏసీసీ ట్రోఫీలతో రికార్డు ఉన్నప్పటికీ, టెస్టు ఫార్మాట్‌లో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ అవ్వగానే ఐపీఎల్ కూడా ఉండడంతో టెస్ట్ కోచ్ పై బీసీసీఐ ఎదో ఒక నిర్ణయానికి రానున్నట్టుగా తెలుస్తుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola