Team India Historic Win at Edgbaston | ఎడ్జ్‌బాస్టన్ కోటను బద్దలు కొట్టిన టీమిండియా
ఆస్ట్రేలియాలో గబ్బాలో గెలిచి చరిత్ర సృష్టించిన టీం ఇండియా ఇప్పుడు ఇంగ్లాండ్ లోను అదే చేసింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్ గా టీమిండియా ... ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌ను 336 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ అలాగే 58 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు బ్రేక్ వేస్తూ ఎడ్జ్‌బాస్టన్ లో తొలిసారి విజయం సొంతం చేసుకుంది.
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ లో టీమిండియా 1967లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. అప్పటి నుండి ఇండియా ఒకసారి కూడా ఈ మైదానంలో గెలవలేదు. ఈ మైదానంలో టీమిండియా ఆడిన 8 మ్యాచ్‌లలో 7 ఓడిపోయింది. 1986లో ఒక టెస్ట్ మ్యాచ్‌ను డ్రా గా ముగిసింది. దిగ్గజ ఆటగాళ్లు, కెప్టెన్లు ఉన్నప్పటికీ కూడా ఇండియా ఎడ్జ్‌బాస్టన్ కోటను బద్దలు కొట్టలేకపోయింది. ఇప్పుడు 2025లో కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ... యువ ఆటగాళ్లతో గేమ్ లోకి దిగిన ఇండియా గెలిచి చూపించింది. ఎవరు ఊహించని విధంగా రికార్డులు క్రియేట్ చేస్తూ ఎడ్జ్‌బాస్టన్ కోటను బద్దలుగొట్టింది. 2021లో గబ్బాలో ఆస్ట్రేలియాపై భారత్ సాధించిన విజయాన్ని ఈ మ్యాచ్ మల్లి గుర్తు చేసింది.