T20 World Cup India vs Pakistan | ఫిబ్రవరి 15న భారత్ - పాక్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్ 2026లో ( T20 World Cup 2026 ) భాగంగా భారత్-పాకిస్థాన్ ( India vs Pakistan ) మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే టీమ్ ఇండియాతో తాము మ్యాచ్ ఆడమని చెప్పుకొచ్చింది పాకిస్తాన్. ఈ టోర్నమెంట్ లో మాత్రమే కాదు.. ఫ్యూచర్ లో జరిగే మ్యాచ్లను కూడా భహిష్కరిస్తునట్టు ప్రకటించారు. అయితే ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board ) తన నిర్ణయాన్ని మార్చుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. 

బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని పాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల టోర్నీకి ఆర్థిక నష్టం కలుగుతుంది. దీనికి బాధ్యత వహిస్తూ పాక్ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసింది. 

ఈ వివాదంపై ఆతిథ్య శ్రీలంక క్రికెట్ బోర్డు ( Sri Lanka Cricket Board ) కూడా స్పందించింది. భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే టికెట్ల అమ్మకాలు, పర్యాటక ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని పీసీబీకి లేఖ రాసింది. ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో, పాక్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునే ఆలోచనలో ఉన్నారట.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola