T20 World Cup 2026 Points Table | వరుణుడి దెబ్బకు పాయింట్స్ టేబుల్ గల్లంతు

టీ20 ప్రపంచ కప్ 2026 అసలు సిసలు మజా ఇచ్చే సూపర్-8 దశకు చేరుకుంది. భారత్, పాకిస్థాన్, ఇంగ్లాండ్ సహా ఎనిమిది మేటి జట్లు సెమీస్ బెర్తుల కోసం పోటీ పడుతున్నాయి. అయితే, ప్రస్తుతం శ్రీలంకలోని కొలంబోలో కురుస్తున్న భారీ వర్షాలు టీమ్స్ భవిష్యతును మార్చేలా కనిపిస్తున్నాయి. ప్లేయర్స్ పోరాటం కంటే వాతావరణమే టీమ్స్ పాయింట్స్ ను మారుస్తుంది. 

సూపర్-8 మ్యాచ్‌లకు ఫలితం రావాలంటే రెండు జట్లు కనీసం 5-5 ఓవర్ల పాటు ఆడటం తప్పనిసరి. ఒకవేళ వర్షం కారణంగా కనీసం 5 ఓవర్ల ఆట కూడా సాధ్యం కాకపోతే, ఆ మ్యాచ్‌ను అధికారికంగా 'రద్దు' చేస్తారు. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు ఉన్నట్లుగా సూపర్-8 మ్యాచ్‌లకు 'రిజర్వ్ డే' లేదు.

మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. గెలిస్తే వచ్చే 2 పాయింట్ల స్థానంలో కేవలం ఒక పాయింట్ మాత్రమే రావడం సెమీస్ రేసులో ఉన్న జట్లకు పెద్ద దెబ్బ. దీనివల్ల నెట్ రన్ రేట్‌పై ఎటువంటి ప్రభావం ఉండదు, కానీ పాయింట్ల పట్టికలో వెనుకబడే ప్రమాదం ఉంది.

కొలంబోలో వాతావరణం ఇప్పటికే తన ప్రతాపాన్ని చూపింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన కీలక పోరు ఒక్క బంతి పడకుండానే రద్దయింది. దీంతో ఇరు జట్లు పాయింట్లను పంచుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సెమీస్ చేరాలంటే తదుపరి మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించడం ఈ జట్లకు అనివార్యంగా మారింది. ప్రతి జట్టుకు మూడు అవకాశాలే ఉండటంతో, వరుణుడు కరుణించకపోతే బలమైన జట్లు కూడా టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola