Suryakumar Yadav Win Percentage in T20s | టీ20 క్రికెట్ నంబర్ 1 కెప్టెన్‌గా స్కై రికార్డ్

Continues below advertisement

భారత టీ20 క్రికెట్‌లో ఒక కొత్త శకం మొదలైంది. గ్రౌండ్ లో 360 డిగ్రీల బ్యాటింగ్‌తో విరుచుకుపడే సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ), ఇప్పుడు కెప్టెన్సీలోనూ 'మిస్టర్ పర్‌ఫెక్ట్' అని నిరూపించుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2026లో ( T20 World Cup 2026 ) భాగంగా నెదర్లాండ్స్‌పై సాధించిన విజయంతో సూర్య భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

నిజానికి ఎంఎస్ ధోనీ ( MS Dhoni ), విరాట్ కోహ్లీ ( Virat Kohli ), రోహిత్ శర్మ వంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఘనతను సూర్య సొంతం చేసుకున్నాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక విన్నింగ్ పెర్సెంటేజ్ కలిగిన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) రికార్డును బద్దలు కొట్టాడు.

నెదర్లాండ్స్‌పై గెలుపు తర్వాత సూర్య విన్ పర్సంటేజ్ 80.85%కి చేరుకుంది. ఇప్పటి వరకు రోహిత్ శర్మ పేరిట ఉన్న 80.65% రికార్డును సూర్య అధిగమించాడు. రోహిత్ శర్మ 62 మ్యాచ్‌ల్లో 50 విజయాలు అందించగా.. సూర్య కేవలం 47 మ్యాచ్‌ల్లోనే 38 విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అంటే సూర్య కెప్టెన్సీలో భారత్ కేవలం 7 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola