Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్

Continues below advertisement

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌ లో లేకపోవడం ఇప్పుడు ఫ్యాన్స్ ను కలవర పెడుతుంది. టీ20 ప్రపంచకప్ 2026కి ముందు ఇలా జరగడంతో ఫ్యాన్స్ ఇంకా కంగారు పడుతున్నారు. ఒకప్పుడు తన బ్యాటింగ్‌తో అందరిని షాక్ కు గురిచేసిన సూర్య కుమార్ యాదవ్.. కెప్టెన్ గా భాద్యతలు తీసుకున్న తర్వాత తన ఫార్మ్ ని నెమ్మదిగా కోల్పోతున్నాడు. కాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా కామెంట్స్ చేసారు. 

“సూర్యకుమార్ యాదవ్‌.. టీమిండియా టీ20 టీమ్ కు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ విషయాన్ని అతను మర్చిపోకూడదు. కెప్టెన్ పని కేవలం టాస్ వేయడం, బౌలర్లను రోటేట్ చేయడం, వ్యూహాలు రచించడం మాత్రమే కాదు. బ్యాట్‌తో కూడా తప్పకుండా రాణించాలి. టాప్-4లో బ్యాటింగ్‌కు వస్తుందున సూర్య తప్పనిసరిగా రన్స్ చేయాలి. ఈ ఏడాది ఇప్పటికే అతడు చాలా మ్యాచ్‌లు ఆడాడు. కానీ గేమ్ మారలేదు. 18 మ్యాచ్‌లు ఆడి కేవలం 15 సగటుతో పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా దారుణంగా ఉంది. ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ఐపీఎల్‌లోనూ అదే పరిస్థితి. టాప్ ఆర్డర్ బ్యాటర్లు రన్స్ చేయకపోతే.. వారు జట్టుకు భారంగా మారినట్లే. ఇదే ఫామ్‌తో టీ20 ప్రపంచకప్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తారు. కెప్టెన్‌తో పాటు.. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా ఫామ్ అందుకోవాల్సి ఉంది” అని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.

ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు 18 అంత‌ర్జాతీయ టీ20లు ఆడిన సూర్యకుమార్ యాదవ్‌.. కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. టీ20 ప్రపంచకప్ మొదలైయే లోగా కెప్టెన్ సూర్య ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola