Surya Kumar Yadav as T20 Captain | టీ20 కెప్టెన్ గా కొనసాగనున్న సూర్య కుమార్ యాదవ్

Continues below advertisement

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20, టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమ్ ఇండియాకు కెప్టెన్ లు మారుతూ వస్తున్నారు. ఎందరో ప్లేయర్స్ పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ కూడా సెలెక్టర్లు మాత్రం శుబ్మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్ లను కెప్టెన్లుగా ఎంచుకుంటున్నారు. ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో శుబ్మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత జరిగిన ఆసియా కప్ టీ20 ఫార్మాట్ కు సూర్య కుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించారు. శుబ్మన్ గిల్ కాస్త నిరాశ పరిచినప్పటికీ కూడా సూర్య కుమార్ యాదవ్ మాత్రం వచ్చిన ఛాన్స్ ను బాగా ఉపయోగించుకుంటున్నాడు. ఐపీఎల్ లో కూడా తన కెప్టెన్సీ తో ఫ్యాన్స్ ను, సెలెక్టర్లను అక్కటుకునాడు. మ్యాచ్ రిజల్ట్ పక్కన పెడితే ఒక కెప్టెన్ గా తన తోటి ప్లేయర్స్ నుంచి కూడా మంచి కామ్ప్లిమెంట్స్ ను అందుకున్నాడు. 

వరల్డ్ కప్ 2023 తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో 4-1 తో ఇండియా భారీ విజయాన్ని అందుకుంది.  అప్పుడు కూడా కెప్టెన్ సూర్యనే. టీ20 కెప్టెన్ గా సూర్య మొత్తం 29 మ్యాచులు ఆడితే అందులో 23 మ్యాచులు ఇండియా గెలిచింది. 

ఇక ఆసియా కప్ లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమ్ ను ముందుకు నడిపించాడు. కెప్టెన్ గా ఈ ఆసియా కప్ లో 100 మార్కులు సాధించిన సూర్య... ఒక బ్యాట్స్మన్ గా ఫ్యాన్స్ ను నిరాశ పరిచాడు అనే చెప్పాలి. అయితే ఇప్పుడు మరోసారి ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ లో టీ20 మ్యాచులకు కెప్టెన్ గా సెలెక్ట్ అయ్యాడు సూర్య కుమార్ యాదవ్. ఈ సారి మాత్రం కేవలం కెప్టెన్ గా మాత్రమే కాదు బ్యాట్స్మన్ గా రన్స్ సాధించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola