Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు

Continues below advertisement

శ్రీలంకతో ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకున్నప్పటికీ.. కొలంబో టెస్టును డ్రాగా ముగించడంతో కీలకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లను కోల్పోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు పదేపదే నో-బాల్స్ వేయడంపై టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రనప్ కొలుచుకునే టెక్నాలజీ ర్యాలు ఉన్న ఈ రోజుల్లో ఓవర్ స్టెప్పింగ్ చేయడానికి ఎలాంటి సాకులు చెల్లవని స్పష్టం చేశారు. 2021 నుంచి రవీంద్ర జడేజా టెస్టుల్లో ఏకంగా 85కి పైగా నో-బాల్స్ వేయడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో, టెస్టుల్లో నో-బాల్ పడితే 'ఫ్రీ హిట్' ఇవ్వాలన్న బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే కామెంట్లపై గవాస్కర్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే టెస్టుల్లో చిన్న బౌండరీలు, ఓవర్‌కు రెండు బౌన్సర్లతో బ్యాటర్లకు ఎక్కువ ప్రయోజనం ఉందన్న ఆయన.. ఫ్రీ హిట్ ఇస్తే గేమ్ బ్యాలన్స్ దెబ్బతింటుందన్నారు.

దీనికి ప్రత్యామ్నాయంగా బౌలర్లపై జరిమానా విధించే ప్రతిపాదన తెచ్చారు. బౌలర్ మొదటి నో-బాల్ వేస్తే ఒక స్పెసిఫిక్ ఫైన్, రెండోసారి వేస్తే దానికి రెట్టింపు జరిమానా విధించాలని సూచించారు. బౌలింగ్ యూనిట్‌లో డిసిప్లిన్ పెరిగేలా ఈ జరిమానాలో సగం మొత్తాన్ని బౌలింగ్ కోచ్‌కూ విధించాలని సంచలన ఐడియా ఇచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola