Sunil Gavaskar About T20 World Cup | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ప్రశంసలు

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ( India vs New Zealand T20 series ) టీమ్ ఇండియా మూడు మ్యాచుల్లో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకుంది. ఇండియా గెలవడంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar ) ప్రశంసలు కురిపించారు. టీమ్ ప్రదర్శన అద్భుతంగా ఉందని అన్నారు. ఒకవేళ టీ20 ప్రపంచకప్ 2026 ( T20 World Cup 2026 ) టోర్నీలో రెండు భారత జట్లు బరిలోకి దిగితే ఆ రెండు ఫైనల్ చేరుతాయని చెప్పారు. 

మూడో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంపై సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ "రెండు భారత జట్లు ఫైనల్ చేరి టైటిల్ కోసం పోటీపడగలవు. భారత ఫస్ట్, సెకండ్ టైర్ టీమ్స్ తలపడితే అది ప్రపంచకప్ ఫైనల్‌లానే ఉంటుంది అని అన్నారు.

"కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు. ఈ మ్యాచ్‌లో భారత బౌలింగ్, ఫీల్డింగ్, క్యాచింగ్ కూడా బాగుంది. టీమిండియా ఆటతీరు అమోఘం. ఏదైనా జట్టు ఈ మ్యాచ్‌ను చూస్తే.. భారత్‌ను ఎలా ఎదుర్కోవాలా? అని ఆలోచిస్తుంది. భారత్ అసాధారణ విజయాన్ని చూసి షాక్ కు గురవుతుంది. అభిషేక్ ( Abhishek Sharma ) అలవోకగా ఫాస్టెస్ సెంచరీలు బాదుతున్నాడు. ఒకసారి 14 బంతుల్లో.. మరోసారి 16 బంతుల్లో హాఫ్ సెంచరీలు నమోదు చేస్తున్నాడు. అతను ఏదో ఒక రోజు యువరాజ్ సింగ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డ్‌ను అధిగమిస్తాడు. అప్పుడు అందరికంటే యువరాజ్ సింగ్ ఎక్కువ ఆనందిస్తాడు.' అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola