SRH vs MI Highlights IPL 2026 | ముంబైపై సన్‌రైజర్స్ అదిరే విక్టరీ

ఐపీఎల్ 2026లో ఆరెంజ్ ఆర్మీ తగ్గదే లేదు అంటుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 244 పరుగుల భారీ స్కోర్ ను చేజ్ చేసింది. ఐపీఎల్ హిస్టరీ లోనే రెండో అతిపెద్ద ఛేజింగ్ రికార్డును నమోదు చేయడంతో పాటు, లీగ్‌లో 100 విజయాల మైలురాయిని అందుకుంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. ర్యాన్ రికెల్టన్ సెంచరీతో 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. రికెల్టన్ కేవలం 55 బంతుల్లోనే 8 సిక్సర్లతో విరుచుకుపడగా, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్ కూడా బాగా పెర్ఫర్మ్ చేసారు. 

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మంచి స్టార్ట్ ఇచ్చారు. కేవలం 8.4 ఓవర్లలోనే వీరిద్దరూ 129 పరుగులు జోడించి మ్యాచ్‌ను ముంబై నుంచి లాగేసుకున్నారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఫీల్డర్ నమన్ ధీర్ చేసిన తప్పులు ముంబై విజయావకాశాలను దెబ్బతీశాయి. ట్రావిస్ హెడ్ ఇచ్చిన మూడు క్యాచ్‌లను నమన్ ధీర్ విడిచిపెట్టాడు. 2 పరుగులు, 30 పరుగులు, 48 పరుగుల వద్ద లభించిన ఈ మూడు అవకాశాలను హెడ్ అద్భుతంగా వాడుకున్నాడు. క్యాచ్‌లు పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola