విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
ఐపీఎల్‌లో అత్యంత విధ్వంసకర జట్టుగా ఎస్‌ఆర్‌ఎచ్‌కి పేరు. ఇక రీసెంట్‌గా అబుదాబి వేదికగా మంగళవారం జరిగిన మినీ ఆక్షన్‌లో రూ.25.5 కోట్ల భారీ పర్స్‌తో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ.. ఈ సారి కొనుగోలు చేసిన ప్లేయర్స్ లిస్ట్‌తో మొత్తం టీమ్ ఇంకా బలంగా మారింది. మినీ వేలంలో లియామ్ లివింగ్ స్టోన్, కార్స్, జాక్ ఎడ్వర్డ్స్‌లని కొనుగోలు చేసింది. ఇప్పుటికే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్‌లతో టాప్ ఆర్డర్ అపోనెంట్‌కి చెమటలు పట్టించే రేంజ్‌లో ఉంటే.. లివింగ్ స్టోన్, కార్స్, ఎడ్వర్డ్స్, నితీశ్ బకుమార్ రెడ్డి లాంటి ప్లేయర్లతో ఇప్పుడు మిడిలార్డర్ కూడా ఇంకాబలంగా మారింది. ఈ బ్యాటింగ్ లైనప్‌ని చూస్తుంటే.. లాస్ట్ సీజన్లో మిస్ యిన 300 మార్క్‌ని ఈ సారి సీజన్లో దాటడం పక్కా అనిపిస్తోంది. అయితే లాస్ట్ సీజన్‌తో పోల్చితే బ్యాటింగ్ బలపడినా.. ఇప్పటికీ బౌలింగ్ వీక్‌గానే ఉందంటున్నారు కొంతమంది ఫ్యాన్స్. ముఖ్యంగా షమి, భువిలకి రీప్లేస్‌మెంట్ తెచ్చే విషయంలో కావ్య పాప ఫెయిలైందని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే నిజానికి ఎస్ఆర్ఎచ్ కొనుగోలు చేసిన 10 మంది ఆటగాళ్లలో 8 మంది బౌలర్లే. ఇందులో నలుగురు ఆల్‌రౌండర్లు ఉండగా.. ఒకరు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఉన్నారు. ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లు ఉండగా.. మరో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు.