Squid Games: స్క్విడ్ గేమ్ లో 'పాక్ కార్మికుడు' భారతీయుడే!
నెట్ ఫ్లిక్స్ లో దుమ్మురేపుతున్న స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ లో పాకిస్థాన్ శరణార్థి అలీ అబ్దుల్ పాత్ర పోషించింది ఓ భారతీయుడే. ఇందులో 199వ ప్లేయర్ గా అదరగొట్టిన నటుడి పేరు అనుపమ్ త్రిపాఠీ. దిల్లీలోని ప్రముఖ నాటక సంస్థల్లో 2006 నుంచి ఐదేళ్లు పనిచేసిన అనుపమ్ దక్షిణ కొరియాలోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్ లో స్కాలర్ షిప్ దొరకటంతో అక్కడికి వెళ్లాడు. శిక్షణ పూర్తయ్యాక ఎంత చిన్నపాత్రలో నటించేందుకైనా సిద్ధపడ్డాడు. ‘స్పేస్ స్వీపర్స్’,‘ఓడ్ టు మై ఫాదర్’,‘హాస్పిటల్ ప్లేలిస్ట్’లోనూ శరణార్థిగానే నటించాడు. స్క్విడ్ గేమ్ లో ఇరగదీశాడు. అలీ పాత్ర కోసం ఆరు కేజీల బరువు పెరిగాడు. పాక్ కల్చర్, ఉర్దూ నేర్చుకున్నాడు. కొరియా సినిమాలతో గుర్తింపు పొందినా... బాలీవుడ్ లో తనను నిరూపించేందుకు తహతహలాడుతున్నాడు.