South Africa whitewashed India | రెండో టెస్ట్ ఓడిపోయిన టీమ్ ఇండియా
ఫ్యాన్స్ ఏదైతే జరగకూడదని అనుకున్నారో అదే జరిగింది. సఫారీలు భారత్ ను వైట్ వాష్ చేసారు. రెండో టెస్ట్‌లో టీమిండియా 408 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇంత భారీ తేడాతో ఓడిపోయి టెస్ట్ చరిత్రలో మనవాళ్లు రికార్డ్ క్రియేట్ చేసారు. టెస్ట్ క్రికెట్ హిస్టరీ భారత గడ్డపై సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేయడం ఇదే తొలిసారి. అదే కాకుండా 25 ఏళ్ల తర్వాత ఇండియాపై సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది.
549 పరుగుల భారీ లక్ష్యంలో భాగంగా 27/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లు ఒకొకరిగా అతి తక్కువ స్కోర్ తో పెవిలియన్ చేరారు.
సౌతాఫ్రికా బౌలర్లలో సిమన్ హర్మర్ ఆరు వికెట్లతో భారత బ్యాటింగ్ లైన్ అప్ ను కుప్పకూల్చాడు. కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు, మార్కో జాన్సెన్, సీనర్ ముత్తుసామి తలో వికెట్ తీసారు. రెండో ఇన్నింగ్స్‌ల్లో కలిపి భారత్.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను కూడా చేయలేకపోయింది.