రికార్డులు బద్దలు కొట్టీన సఫారీలు ఆసీస్, భారత్‌తో టాప్ ప్లేస్‌లోకి..
టీమిండియాపై రెండో వన్డేలో సూపర్ విక్టరీ సాధించిన సౌతాఫ్రికా వన్డే క్రికెట్ హిస్టరీలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. భారత్‌పై అత్యధిక స్కోర్ ఛేజ్ చేసిన రెండో టీమ్‌గా రికార్డులకెక్కింది. అయితే సపారీల కంటే ముందు ఆసీస్ ఈ ఘనత సాధించింది. 2019లో మొహాలీలో జరిగిన వన్డేలో 359 పరుగుల టార్గెట్‌నే ఆసీస్ కూడా భారత్‌పై ఛేజ్ చేసింది. ఇక ఇప్పుడు సఫారీ టీమ్ కూడా అదే 359 పరుగుల టార్గెట్‌ని ఛేజ్ చేయడంతో ఇండియాపై ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా నిలిచింది.
ఇది మాత్రమే కాదు.. ఓవరాల్‌గా 350 పరుగుల కంటే ఎక్కువ టార్గెట్‌ను ఛేజ్ చేసిన మూడో టీమ్‌గా రికార్డుకెక్కింది సఫారీ టీమ్. ఇంతకుముందు ఆస్ట్రేలియా, ఇండియా ఈ రికార్డ్ సాధించాయి. ఆసీస్ మొత్తంగా మూడుసార్లు 350 ప్లస్ స్కోర్ ఛేజ్ చేస్తే.. ఇండియా కూడా మూడు సార్లే 350 ప్లస్ స్కోర్‌ని ఛేజ్ చేసింది. అయితే ఇప్పటివరకు సౌతాఫ్రికా కేవలం రెండు సార్లు మాత్రమే 350 ప్లస్ ఛేజ్ చేయగా.. బుధవారం ఇండియాపై గెలుపుతో ముచ్చటగా మూడోసారి 350 ప్లస్ స్కోర్ ఛేజ్ చేసి.. ఇండియా, ఆసీస్ సరసన నిలిచింది.