Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. వైజాగ్ లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో .. మహిళల టీ20 క్రికెట్‌లో నాలుగు వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఇండియన్ బ్యాట్స్మన్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో రెండో బ్యాటర్‌గా నిలిచింది. స్మృతి కంటే ముందు న్యూజిలాండ్ బ్యాటర్ సుజీ బేట్స్ ఈ ఘనత సాధించింది.
శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో స్మృతి 25 బంతుల్లో 25 పరుగులు చేసి అవుటయింది. ఇప్పటికే స్మృతి మంధాన మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగుల మార్క్‌కు చాలా చేరువలో ఉంది. ఆమె ఇప్పటివరకు టీ20ల్లో 4,007 పరుగులు, వన్డేల్లో 5,322 పరుగులు, టెస్టుల్లో 629 పరుగులు సాధించింది. మొత్తం మీద మరో 42 పరుగులు చేస్తే 10 వేల పరుగుల క్లబ్‌లోకి వెళ్తుంది.
శ్రీలంకతో జరిగిన తోలి టీ20లో మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 122 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేనా కేవలం 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.