Smriti Mandhana Post after Wedding Postponement | పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలి పోస్ట్

Continues below advertisement

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉంది. అయితే, స్మృతి మంధానా తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో పెళ్లి వాయిదా పడింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో పలాష్ ముచ్చల్ గురించి చర్చలు జరిగాయి. ఈ మొత్తం వ్యవహారం తర్వాత స్మృతి మంధాన సోషల్ మీడియాలో మొదటి పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ పెళ్లి లేదా పెళ్లి తేదీకి సంబంధించినది అయితే కాదు. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు స్మృతి చేతి వేలికి నిశ్చితార్థపు ఉంగరం లేదని కామెంట్స్ చేస్తున్నారు. 

ఒక బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా వీడియో షేర్ చేసారు స్మృతి మంధాన. అభిమానుల దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే స్మృతి మంధాన వేలికి నిశ్చితార్థపు ఉంగరం కనిపించలేదు. కొంతమంది అభిమానుల ఈ వీడియో పెళ్లి తేదీకి ముందుది అని అంటున్నారు. మరొక అభిమాని  పలాష్ ముచ్చల్ స్మృతి మంధానాకు ప్రపోజ్ చేయడానికి ముందు ఈ వీడియో తీసి ఉండవచ్చని అనుమానపడ్డాడు. ఇక త్వరలోనే స్మ్రితి మళ్ళి మైదానంలో కనిపించబోతుంది. ఇండియా శ్రీలంక మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో సందడి చేయనుంది. ఆ తర్వాత జనవరిలో డబ్ల్యూపీఎల్ ప్రారంభం కానుంది. ఇందులో స్మృతి మంధాన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు నాయకత్వం వహిస్తుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola