SKY Breaks Silence On T20 Captaincy | టీ20 కెప్టెన్సీ మార్పుపై సూర్యకుమార్ షాకింగ్ కామెంట్స్

Continues below advertisement

భారత టీ20 జట్టుకు 2026 వరల్డ్ కప్ ట్రోఫీని అందించిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీ మార్పుపై తొలిసారి స్పందించాడు. టీ20 వరల్డ్ కప్ గెలిపించినా, అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించడం మరియు పర్యటనలకు సూర్యను తప్పించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఒక ఇంటర్వ్యూలో సూర్యకుమార్ తన మనసులోని మాటలను పంచుకున్నాడు. "జట్టు ప్రకటనలో నా పేరు లేకపోవడం చూసి ఒక్కసారిగా నవ్వుకున్నాను. 2026 వరల్డ్ కప్ తర్వాత ఒలింపిక్స్ వరకు తనే జట్టును నడిపిస్తానని భావించాను. కానీ సెలెక్టర్ల ఆలోచన వేరేలా ఉంది. భవిష్యత్తు కోసం మరొకరికి బాధ్యతలు ఇవ్వాలనుకుంటే ఆ నిర్ణయాన్ని గౌరవిస్తాను" అని చెప్పాడు.

అయితే ఈ హఠాత్ మార్పు తనను నిరాశపరిచిందని సూర్య ఒప్పుకున్నాడు. "రెండేళ్లలో ఒక్క బైలేటరల్ సిరీస్ ఓడిపోలేదు, ఆసియా కప్ మరియు టీ20 వరల్డ్ కప్ గెలిచాం. అంతా బాగున్నప్పుడు ఈ మార్పు ఎందుకో అర్థం కాలేదు. నెలన్నర పాటు ఇంట్లోనే ఉండిపోయాను, ఒంటరిగా ఉన్నప్పుడు తీవ్ర బాధ కలిగింది" అని పేర్కొన్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola