SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY

Continues below advertisement

సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌  కు ముందు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా శుభ్‌మన్ గిల్ , హార్దిక్ పాండ్యా రీఎంట్రీపై స్కీ స్కై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇదే ప్రెస్ మీట్ లో టీమ్ లో ఓపెనర్లుగా ఎవరెవరు బరిలోకి దిగుతారో కూడా ఫ్యాన్స్ కు ఒక క్లారిటీ ఇచ్చాడు. సంజూ శాంసన్ కంటే కూడా.. శుభ్‌మన్ గిల్.. ఓపెనర్‌గా వచ్చేందుకు అర్హుడని అన్నాడు కెప్టెన్ సూర్య. 

“సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో కూడా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు జరుగుతాయి. మూడో స్థానం నుంచి ఆరో బ్యాటర్ వరకు ఆటగాళ్ల పొజిషన్‌ మారుతూనే ఉంటుంది. ఓపెనర్లు తప్పా మరే ఆటగాడికి కూడా ఫిక్స్డ్‌ బ్యాటింగ్ పొజిషన్ ఉండదు. టీమ్ లో ఏ స్థానంలోనైనా సత్తాచాటే ప్లేయర్స్ ఉన్నారు. టీమ్ మొత్తం టాలెంటెడ్ ప్లేయర్స్ ఉండటంతో ఫైనల్ టీమ్ సెలక్షన్ తలనొప్పిగా మారింది. తొలి టీ20లో తిలక్ వర్మ ఆరో స్థానంలో.. శివమ్ దూబే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావొచ్చు. ఇదే మా స్టైల్‌” అని సూర్యకుమార్ అన్నాడు.

ఇక టీమ్ ఇండియా ఓపెనర్‌ గురించి మాట్లాడుతూ “సంజూ శాంసన్ ఓపెనర్‌గా పరుగులు చేశాడు. కానీ అతడి కంటే ముందే గిల్‌ ఓపెనర్‌గా ఆడాడు. అందుకే ఓపెనర్‌గా శుభ్‌మన్‌ గిల్‌ ఆడిస్తున్నాం. అందుకు గిల్ పూర్తి అర్హుడు. సంజూ శాంసన్‌కు చాలా అవకాశాలు ఇచ్చాం. సంజూ ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్దంగా ఉన్నాడు. అతడి లాంటి ఆటగాళ్ల వల్ల కెప్టెన్‌గా నా పని మరింత ఈజీ అవుతుంది. ఓపెనింగ్ చేయడంతో పాటు మిడిలార్డర్‌లో ఆడగలిగే సత్తా అతడికి ఉంది” అని చెప్పుకొచ్చాడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola