Sindhu in Indonesia Masters Quarterfinals | చరిత్ర సృష్టించిన PV సింధు

Continues below advertisement

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ( PV Sindhu ) అరుదైన రికార్డును సృష్టించింది. తన ఇంటర్నేషనల్ కెరీర్ లో మొత్తం 500 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ఇండోనేషియా మాస్టర్స్‌ 2026లో భాగంగా డెన్మార్క్‌ ప్లేయర్ ను వరుస సెట్లలో ఓడించి ఈ ఘనతను సాధించింది. 

బ్యాడ్మింటన్‌ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో ఇప్పటి వరకు ఈ రికార్డును ఐదుగురు మాత్రమే అందుకున్నారు. ఇప్పుడు ఆరో ప్లేయర్‌గా సింధు నిలిచింది. భారత్‌ తరఫున ఈ ఘనత నెలకొల్పోయిన తోలి ప్లేయర్ గా కూడా రికార్డు సృష్టించింది. 

ఇండోనేషియా మాస్టర్స్‌లో తాజాగా జరిగిన ప్రీ క్వార్టర్స్​లో లైన్‌ హోజ్‌మార్క్‌ను ఎదుర్కొన్న సింధు వరుస సెట్లలో విజయం సాధించింది. తాజా విజయంతో సింధు క్వార్టర్ ఫైనల్స్​కు దూసుకెళ్లింది. ఈ ఏడాదిలో సింధు క్వార్టర్ ఫైనల్స్​ ఆడడం ఇది రెండోసారి. రీసెంట్​గా మలేసియా ఓపెన్​లో సింధు తృటిలో ఫైనల్​ ను మిస్ చేసుకుంది. ఈ టోర్నీలో క్వార్టర్స్​లో యమగుచిపై నెగ్గిన సింధు సెమీస్​కు దూసుకెళ్లింది. కానీ, సెమీస్​లో ఓటమిని ఎదుర్కొని ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ​

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola