Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
కేకేఆర్‌పై భారీ విజయం తర్వాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కోల్‌కతాపై గెలిచిన అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న గిల్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. "నాకు రికార్డులు లేదా ఆరెంజ్ క్యాప్ కంటే టీమ్ గెలవడమే ముఖ్యం. ఈ సీజన్‌లో కేవలం మ్యాచ్‌లు గెలవడం మాత్రమే కాదు, ఫైనల్‌కు తీసుకెళ్లి కప్పును తీసుకోవడమే నా ఏకైక లక్ష్యం" అని గిల్ స్పష్టం చేశాడు.
భారీ ఇన్నింగ్స్ ఆడినా కూడా తనే స్వయంగా మ్యాచ్ ఫినిష్ చేయలేక పొయ్యాను అంటూ అసంతృప్తి వ్యక్తం చేసాడు. "నేనే క్రీజులో ఉండి మ్యాచ్ ఫినిష్ చేయాల్సింది. కరెక్ట్ టైంలో అవుట్ అవ్వడం కాస్త నిరాశ కలిగించింది. ఒకవేళ మరో రెండు ఓవర్ల ముందే మ్యాచ్ ముగించి ఉంటే రన్ రేట్‌కు కూడా కలిసొచ్చేది" అని అన్నాడు.
డెత్ ఓవర్లలో మహమ్మద్ సిరాజ్, కాగిసో రబాడ స్పెల్ సూపర్ అని అన్నాడు. వికెట్లు తీయాలనే పాజిటివ్ మైండ్‌సెట్‌తోనే బౌలింగ్ మార్పులు చేసినట్లు వెల్లడించాడు. తన సక్సెస్ సీక్రెట్ గురించి చెబుతూ.. "గత తప్పుల గురించి ఆలోచించకుండా, ఫ్యూచర్ గురించి ఊహించుకోకుండా కేవలం ప్రెసెంట్ మీద దృష్టి పెట్టడమే నా బ్యాటింగ్, కెప్టెన్సీలో మార్పు తీసుకొచ్చింది" అని గిల్ పేర్కొన్నాడు.
ట్రెండింగ్ వార్తలు





















