Shubman Gill Slip Catch vs Afghanistan | రోహిత్ రనౌట్‌పై గిల్ షాకింగ్ కామెంట్స్

Continues below advertisement

తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ ను ఓడించింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడూతూ.. తన కెరీర్‌లోనే ఒక తీరని కోరిక ఈ మ్యాచ్‌తో నెరవేరిందని ఎమోషనల్ అయ్యాడు. అసలు గిల్ అంతగా ఆనందపడటానికి కారణం ఏంటో చూద్దాం.

ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఒక కళ్లు చెదిరే క్యాచ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. హర్ష్ దూబే వేసిన బౌలింగ్‌లో అఫ్గాన్ బ్యాటర్ గజన్‌ఫర్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో గిల్ డైవ్ చేస్తూ పట్టుకునాడు. ఈ మ్యాచ్‌కే క్యాచ్‌పై గిల్ స్పందిస్తూ "నేను స్లిప్ క్యాచ్‌ల కోసం చాలా ప్రాక్టీస్ చేశాను. నా కెరీర్‌లో ఇప్పటివరకు ఇలాంటి గ్రేట్ క్యాచ్‌లు ఎప్పుడూ అందుకోలేదు. నా కెరీర్‌లోనే ఇది బెస్ట్ క్యాచ్. నా కోరిక ఈరోజు నెరవేరింది" అంటూ సంతోషం వ్యక్తం చేశాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం వల్ల 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ దాదాపు టీ20 లాగే సాగిందని గిల్ అన్నాడు. గుర్బాజ్ సెంచరీతో అఫ్గాన్ మ్యాచ్‌ను లాగేసుకునేలా కనిపించినా, మన బౌలర్లు పుంజుకున్నారని మెచ్చుకున్నాడు. రోహిత్ శర్మ రనౌట్ అవ్వడంపై గిల్ స్పందిస్తూ.. "రోహిత్ భాయ్ రనౌట్ అవ్వడంపై పర్వాలేదు, గత మ్యాచ్‌లో కూడా అతను ఇలాగే రనౌట్ అయ్యాడు" అంటూ కూల్‌గా సమాధానమిచ్చాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola