Shubman Gill, Jadeja in Ranji Trophy | రంజీ ట్రోఫీలో ఆడనున్న గిల్, జడేజా

Continues below advertisement

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్  2 - 1తో ఓటమి ఎదుర్కుంది. డిసైడింగ్ మ్యాచ్ అయిన మూడవ వన్డేలో విరాట్ కోహ్లీ ( Virat Kohli ), నితీష్ రెడ్డి ( Nitish Reddy ), హర్షిత్ రాణా ( Harshit Rana ) తప్పా మిగితా ఎవరు అంతగా రాణించలేదు. గిల్, జడేజా వంటి ప్లేయర్స్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. గిల్ మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 135 పరుగులు చేస్తే, జడేజా సిరీస్ మొత్తంలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 43 పరుగులే చేశాడు.

ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుందట. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ( Ravindra Jadeja ) దేశవాళీ క్రికెట్‌లో ఆడమని సూచించారట. వీళ్లిద్దరు రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం ఉంది. జడేజా టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకగా, గిల్‌ను టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు. 

ప్రస్తుతం టీమ్ ఇండియా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ను ఆడనుంది. ఆ వెంటనే 2026 టీ20 వరల్డ్‌కప్‌ ఉంది. గిల్, జడేజాకు ఎలాగో రెస్ట్ ఉంటుంది. కాబట్టి రంజీ ట్రోఫీకు అందుబాటులో ఉంటారు. మరి ఈ ఇద్దరు ప్లేయర్స్ దేశవాళీ క్రికెట్ లో ఎలా ప్రూవ్ చేసుకుంటారో చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola