Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Continues below advertisement

2026 టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా స్క్వాడ్‌ లో శుబ్మన్ గిల్ పేరు లేకపోవడం పెద్ద దూమారామే రేపింది. అప్పటివరకు టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్న ప్లేయర్ పై ఒక్కసారిగా వేటు పడటంతో అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు కూడా ఆశ్చర్యానికి గురైయ్యారు. 

సెలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయానికి కారణం గిల్ ఫార్మ్ లో లేకపోవడమే. గత 14 టీ20 ఇన్నింగ్స్‌ల్లో గిల్ పరుగులు రాబట్టలేక పొయ్యాడు. గిల్ స్థానంలో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి వికెట్ కీపర్ బ్యాటర్లకు సెలెక్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. పవర్ ప్లేలో త్వరగా పరుగులు రాబట్టే యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ వంటి ప్లేయర్స్ గిల్ కంటే మంచి ఆప్షన్స్ అని సెలెక్షన్ కమిటీ భావించిందని అంటున్నారు విశ్లేషకులు. 

టీ20ల్లో నిరాశ ఎదురైనా, వన్డే మరియు టెస్టు ఫార్మాట్లలో గిల్ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం వన్డే, టెస్టు టీమ్ కు కెప్టెన్‌గా ఉన్న గిల్, న్యూజిలాండ్‌ సిరీస్‌తో మళ్ళీ ఫామ్‌లోకి రావాలని పట్టుదలతో ఉన్నాడు. ఐపీఎల్ 2026లో సత్తా చాటితే తిరిగి టీ20ల్లో గిల్ చోటు దక్కించుకునే అవకాశం ఉంటుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola