Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
రెండు ఫార్మాట్లకు టీమ్ ఇండియా తరపున నాయకత్వం వహిస్తున్న యంగ్ ప్లేయర్ శుబ్మన్ గిల్ .. టీ20 మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. ఆసియాకప్ 2025 తో టీ20 టీమ్ కు వైస్ కెప్టెన్‌గా భద్యతలు తీసుకున్న గిల్ ఆశించిన స్థాయిలో మాత్రం రాణించలేక పోతున్నాడు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో గోల్డెన్ డక్ అయ్యాడు శుబ్మన్ గిల్. భారత్ తరఫున గత 18 టీ20 మ్యాచ్‌లలో గిల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. సౌతాఫ్రికాతో గత నాలుగు మ్యాచులలో సింగిల్ డిజిట్‌కే ఔట్ అయ్యాడు.
శుభ్‌మన్ గిల్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. వరుసగా విఫలమవుతున్నా తనకి ఎందుకు అన్ని ఛాన్స్‌లు ఇస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కావాలనే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. సంజు శాంసన్, యశశ్వి జైస్వాల్ వంటి ఫార్మ్ లో ఉన్న బ్యాట్సమన్ ను పక్కన పెట్టి ఫార్మ్ కోల్పోయిన శుబ్మన్ గిల్ ను ఎందుకు టీమ్ లోకి సెలెక్ట్ చేస్తున్నారంటూ క్రికెట్ విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తున్నారు.