Shubman Gill First Win as Captian | గెలిచిన టీమిండియా... విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇదే

కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ తోలి విజయాన్ని అందుకున్నాడు. ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తూ.. తన టీం గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి టెస్టు విజయంతో చరిత్ర సృష్టించాడు. డబుల్ సెంచరీతో చెలరేగాడు. అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత శుబ్మన్ గిల్ చెప్పిన మాటలు విన్న వారంతా అతనికి  ఫ్యాన్స్ అయిపోతున్నారు. కెప్టెన్ అంటే ఇలానే ఉండాలంటూ ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. 

తోలి టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత టీంతో చర్చించుకున్న విషయాల గురించి పంచుకున్నాడు. అలాగే తాము అనుకున్నవి పక్కాగా అమలు చేయగలిగామని అన్నాడు. సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌ సూపర్‌ బౌలింగ్‌ చేశారని... ప్రసిద్ధ్‌ కృష్ణ వికెట్లు తీసుకోకపోయినా.. చాలా బాగా బౌలింగ్‌ చేశాడని ప్రశంసించాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. బాగా బౌలింగ్‌ చేశాడని అతనికి కాంఫిడెన్స్ ఇచ్చాడు. తన మాటలతో ప్రసిద్ధ్‌ కృష్ణ కు మోరల్‌ సపోర్ట్‌ ఇచ్చాడు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ అంతా కెప్టెన్ అంటే ఇలా కదా ఉండాలి అని అంటున్నారు. మంచి ప్రదర్శన కనబర్చిన వారి గురించి చెప్పక పోయినా పర్వాలేదు... కానీ డిస్సపాయింట్మెంట్ తో ఉన్న ప్లేయర్ కి తోడుగా నిలిచి కాంఫిడెన్స్ ఇస్తే బాగా పెర్ఫర్మ్ చేయగలుగుతారు అని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. 

 ఓటమి తర్వాత ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ మాట్లాడుతూ టీమిండియా ఒక క్లాస్‌ టీమ్‌ అని అన్నాడు. వరల్డ్‌ క్లాస్‌ ప్లేయర్లతో ఆడుతున్నప్పుడు ఇలాంటివి సహజమే అని అన్నాడు. గిల్‌ చాలా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడని, చాలా సేపు క్రీజ్‌లో ఉంటూ ఆడటంతో తాము శారీరకంగా, మానసికంగా కూడా అలసిపోయామంటూ చెప్పుకొచ్చాడు బెన్ స్టోక్స్. 

మ్యాచ్ గెలవడంపై విరాట్‌ కోహ్లీ ఎక్స్‌ వేదికగా స్పందించారు. “ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌ గొప్ప విజయం సాధించింది. శుభ్‌మాన్ బ్యాట్‌తో, ఫీల్డ్‌లో అద్భుతంగా నాయకత్వం వహించాడు. అందరూ అద్భుతంగా ఆడారు. ఈ పిచ్‌పై బౌలింగ్ చేసిన విధానానికి సిరాజ్, ఆకాష్‌లను ప్రత్యేకంగా అభినందించాలి... అని అన్నాడు విరాట్ కోహ్లీ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola