Shubman Gill Double Century | సెంచరీతో శుబ్‌మన్ గిల్ బ్రేక్ చేసిన రికార్డులు ఇవే
క్రికెట్ లో ఒక బ్యాట్స్‌మెన్ డబుల్ సెంచరీ చేయడం అంటే ఎంతో స్పెషల్. అది టెస్ట్ మ్యాచ్ లో అయితే మాత్రం ఇంకా స్పెషల్ గా ఉంటుంది. ప్రస్తుతం శుబ్మన్ గిల్ అదే స్టేజ్ లో ఉన్నాడు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. 269 పరుగులు చేసి రికార్డులతో పాటు ఫ్యాన్స్ హృదయాలను కూడా గెలుచుకున్నాడు.
4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ రికార్డులు తిరగరాస్తున్నాడు ఈ యంగ్ కెప్టెన్. ప్రతి మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ తో సత్తా చాటుతున్నాడు. 125 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. 199 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మోతంగా 269 పరుగులు చేసి ... కొంచంలో ట్రిపుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. కెప్టెన్‌గా వరుసగా రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు చేసిన నాలుగో భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు శుబ్‌మన్ గిల్. కెప్టెన్‌గా భాద్యతలు తీసుకున్న తర్వాత 3 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు చేయడం విశేషం. అయితే ఇంగ్లండ్ కోచ్‌గా మెక్‌కలమ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత .. ఆ టీం ప్రదర్శన పూర్తిగా మారిపోయింది. బజ్ బాల్‌తో మోత మోగించేది. మెకల్లమ్ సారథ్యంలో ఇంగ్లండ్ ఆడిన 35 టెస్టుల్లో 22 గెలిచింది. కానీ ఈ బాజ్ బాల్ శకం మొదలైన తర్వాత ఇంగ్లండ్ ఎక్కువ రన్స్ సమర్పించుకోవటం కూడా ఇదే మొదటి సారి. టీం ఇండియా డామినేషన్ తో బజ్ బాల్ కి గట్టి బ్రేక్ పడిందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ మరింత హోరాహోరీగా సాగనుంది.