Shubman Gill about Being One Day Captain | వన్డే కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన ప్రిన్స్!

Continues below advertisement

టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలిగించి ఆ భాద్యతలను శుబ్మన్ గిల్ కు అప్పగించారు. అయితే ఈ విషయంపై శుభమన్ గిల్ తొలిసారి స్పందించాడు. రోహిత్ శర్మను కెప్టెన్ గా తప్పించి... వన్డే క్రికెట్ క్యాప్టిన్సి తనకు అప్పగిస్తున్నారన్న విషయం ముందే తెలుసనీ అన్నాడు గిల్. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆఫిసియల్ గా ప్రకటించే ముందు తనకు ఈ విషయం తెలుసంటూ శుబ్మన్ గిల్ పేర్కొన్నాడు. “టెస్టు మ్యాచ్ మధ్యలోనే ఈ ప్రకటన వచ్చింది. నాకు ముందే సమాచారం ఇచ్చారు. ఇది నాకు చాలా పెద్ద గౌరవం, అలాగే గొప్ప బాధ్యత కూడా. దేశాన్ని నడిపే అవకాశం రావడం ఏ ఆటగాడికైనా గర్వకారణమే” అని అన్నాడు.

రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ “రోహిత్ భాయ్‌ నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ముఖ్యంగా ఆయనకు ఉన్న కామ్ నేచర్, అలాగే టీమ్ లో అందరితో స్నేహంగా ఉండే తీరు.. నాకు ఎంతో ప్రేరణగా ఉంటుంది. ఈ లక్షణాలను నేనూ కొనసాగించాలి అనుకుంటున్నాను” అని గిల్ చెప్పాడు.
ఇక మూడు ఫార్మాట్ల క్రికెట్ క్యాప్టిన్సి గురించి మాట్లాడుతూ.. ఇప్పటివరకు సాధించిన విజయాలపై దృష్టి పెట్టడం కంటే, రాబోయే పోటీల్లో గెలవడంపైనే దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను” అని గిల్ స్పష్టంగా తెలిపాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola