బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిన గిల్.. మరి పనిష్మెంట్ లేదా?

Continues below advertisement

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేశాడు. అయినా అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు ఫ్యాన్స్ బీసీసీఐని నిలదీస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. సౌతాఫ్రికాతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లోనే మెడ గాయంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొత్తం మ్యాచ్ నుంచే తప్పుకున్న విషయం తెలిసిందే. వెంటనే అతడ్ని బీసీసీఐ మెడికల్ టీమ్ చెక్ చేసి ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్ ఇచ్చింది. ఈ గాయం నుంచి కోలుకోవాలంటే బెడ్ రెస్ట్ చాలా అవసరమని, క్రికెట్ ఆటడం కాదు కదా.. కనీసం ట్రావెల్ కూడా చేయకూడదని, ఎయిర్ ట్రావెల్ అసలే చేయొద్దని క్రియర్‌గా చెప్పింది.

కానీ మెడికల్ టీమ్ ఇంతలా చెప్పినా.. గిల్ ఆ వార్నింగ్స్‌లో దేన్నీ పట్టించుకోలేదు. సఫారీ టీమ్‌తో గువాహటి వేదికగా జరగబోతున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం మొత్తం జట్టు టీమ్ బస్సులో ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరగా.. గిల్ కూడా టీమ్ ఫిజియోతో కలిసి వేరే కారులో విడిగా గువాహతికి ప్రయాణం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నాడు. అంటే బీసీసీఐ (BCCI) మెడికల్ ప్రోటోకాల్స్‌ని గిల్ బ్రేక్ చేశాడన్నమాట. 

గాయం పూర్తిగా మానకపోయినా, నవంబర్ 22న ప్రారంభమయ్యే ఈ చివరి టెస్ట్‌లో జట్టుతో ఉండాలని గిల్ బలంగా నిర్ణయించుకోవడం వల్లే.. ఇలా చేసినట్లు తెలుస్తోంంది. ఇక దీనిపై ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రావడం.. గిల్ ప్రోటోకాల్‌ బ్రేక్ చేసినా చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించడంతో ఎట్టకేలకు బీసీసీఐ కూడా స్పందించింది. గిల్ ఎలాంటి రూల్స్ బ్రేక్ చేయలేదని, రాత్రంతా కోల్‌కతాలో అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత.. మరుసటి రోజు డిశ్చార్స్ చేయడం జరిగిందని.. అయితే ట్రావెల్ చేయొద్దని డాక్టర్లు చెప్పిన మాట వాస్తవమే అయినా.. ఫిజియో పర్యవేక్షణలోనే గిల్ ట్రావెల్ చేశాడని ఓ బీసీసీఐ అధికారి చెప్పుకొచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola