Shreyas Iyer Re - Entry In Cricket Team | శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీకి ఎదురు చూపులు తప్పవా ?
శ్రేయాస్ అయ్యర్ ఫ్యాన్స్ బీసీసీపై చాలా కోపంగా ఉన్నారు. అందుకు కారణం ఆసియా కప్ 2025 లో స్క్వాడ్‌లోనే కాకుండా కనీసం స్టాండ్‌బై లిస్టులో కూడా అయ్యర్ లేకపోవడం. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా, ప్లేయర్‌గా శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. కానీ ఆసియా కప్ కు మాత్రం సెలక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. సెలెక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు మాజీ క్రికెటర్లు కూడా షాక్ అయ్యారు.
ఆసియా కప్ సెలెక్ట్ అవ్వనప్పటికీ కూడా అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్ కు శ్రేయాస్ ను ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. అయ్యర్ తన చివరి టెస్ట్ ను 2024 ఫిబ్రవరిలో ఆడాడు. స్పిన్ బౌలింగ్‌ని బాగా ఆడగలడు. హోమ్ స్పిన్ పిచ్‌లపై జరిగే సిరీస్‌కి శ్రేయాస్ ను సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.
అయితే ఈ నెలలో ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు శ్రేయాస్. ప్రస్తుతం వెస్ట్ జోన్ టీంలో శ్రేయాస్ ఆడుతున్నాడు. ఈ ట్రోఫీలో ఎలాగైనా తన ప్రదర్శనతో సెలెక్టర్లకు గట్టి జవాబు ఇస్తాడని అంటున్నారు శ్రేయాస్ అయ్యర్ ఫ్యాన్స్.