Shreyas Iyer Father on Asia Cup Team | ఆసియ కప్ సెలక్షన్ పై స్పందించిన శ్రేయస్ తండ్రి

ఆసియా కప్‌ 2025లో శ్రేయాస్ అయ్యర్ ను సెలెక్ట్ చేయకపోవడం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై శ్రేయస్ స్పందించలేదు. కానీ తన తండ్రి సంతోష్ అయ్యర్‌ మాత్రం కొడుక్కి టీంలో చోటు దక్కపోవడంపై స్పందించారు.

సంతోష్ అయ్యర్‌ మాట్లాడుతూ.. ఐపీఎల్ లో శ్రేయస్ అద్భుతంగా రాణించాడు. తన కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ లాంటి టీమ్స్ ను ఫైనల్‌ వరకు తీసుకెళ్లాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌ టైటిల్ కూడా గెలుచుకుంది. అయ్యర్‌ను టీం కెప్టెన్ గా చేయమని నేను అడగట్లేదు. కనీసం జట్టులో ఎందుకు తీసుకోలేదో చెప్పమని మాత్రమేనని అడుగుతున్నా... అని చెప్పుకొచ్చారు. అయితే టీం లో చోటు లభించకపోవడంపై శ్రేయస్ పెద్దగా పట్టించుకోలేదని సంతోష్ చెప్పారు. నాకు అదృష్టం లేదు అని చెప్పి వెళ్ళిపొయ్యాడని అన్నారు శ్రేయాస్ తండ్రి సంతోష్ అయ్యర్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola