Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్

Continues below advertisement

ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్‌కు కోలుకోలేని భారీ షాక్ తగిలింది! ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ 2026లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీమ్ మెయిన్ ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా టోర్నమెంట్ మొత్తానికి దూరం అయింది. 

నెదర్లాండ్స్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా శ్రేయాంక రైట్ యాంకిల్ తీవ్రంగా ట్విస్ట్ అయ్యింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 6వ ఓవర్లో బాల్‌ను చేజ్ చేసే క్రమంలో ఆమె కిందపడిపోయింది. నొప్పితో విలవిలలాడిన శ్రేయాంకను స్ట్రెచ్చర్‌పై గ్రౌండ్ బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది.

శ్రేయాంక కెరీర్‌లో గాయాలు ఒక పెద్ద శాపంగా మారాయి. గతంలోనే వరుస గాయాల వల్ల క్రికెట్ వదిలేద్దాం అనుకున్నానని ఆమె ఎమోషనల్ అయ్యింది. ఇప్పుడిప్పుడే కోలుకుని పాకిస్తాన్‌పై మంచి కంబ్యాక్ ఇచ్చిందనుకునే లోపే, మళ్లీ ఇలాంటి మెగా టోర్నీ నుండి తప్పుకోవాల్సి రావడం ఆమెకు పెద్ద ఎదురుదెబ్బ. ఈ టోర్నమెంట్ లో టీమ్ ఇండియా కప్ ను భారత్ కూడా తెచ్చే దిశగా ముందుకు వెళ్తుంది. తమ టీమ్ లోని లోపాలను  కరెక్ట్ చేసుకొని మ్యాచ్ విన్ అవుతున్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola