Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్

Continues below advertisement

ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒకే ఒక్క మ్యాచ్‌తో వరల్డ్ రికార్డులను తిరగరాసింది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఈ యంగ్ బౌలర్ అద్భుతమైన బౌలింగ్ మ్యాజిక్‌తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడమే కాకుండా.. శ్రీ చరణి ఇండియా తరఫున ఆల్‌టైమ్ రికార్డ్‌ను బద్దలు కొట్టింది.

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో షోర్నా అక్తర్‌ను అవుట్ చేయడం ద్వారా శ్రీ చరణి ఈ టోర్నమెంట్‌లో తన 11వ వికెట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ ఒక్క వికెట్‌తో 2020 వరల్డ్ కప్‌లో పూనమ్ యాదవ్ నెలకొల్పిన 10 వికెట్ల రికార్డును చరణి బ్రేక్ చేసింది. అంతటితో ఆగకుండా, అదే ఓవర్లోనే మరో వికెట్ తీసి మొత్తం 12 వికెట్లతో.. ఒకే ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా నిలిచింది.

నిజానికి ఈ వరల్డ్ కప్ చరణి కెరీర్‌లోనే ఒక మైండ్‌బ్లోయింగ్ జర్నీ అని చెప్పాలి. ఈ టోర్నీలో ఆమె ప్రదర్శనతో ఆల్రెడీ ఐసీసీ ఉమెన్స్ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు, సౌతాఫ్రికాపై 3 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన చరణి.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి రన్ రేట్‌ను పూర్తిగా కంట్రోల్ చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola