Shahid Afridi on T20 World Cup Ind vs Pak | న్యాయం చేయాలంటూ షాహిద్ డిమాండ్

టీ20 వరల్డ్‌కప్ 2026లో ( T20 World Cup 2026 ) భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంపై మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ( Shahid Afridi ) స్పందించారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా నిలుస్తునట్టు తెలిపారు. అలాగే ఈ వ్యవహారంలో ఐసీసీ న్యాయంగా వ్యవహరించాలని కోరారు.

భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ ను పాక్ ప్రభుత్వం ( Pakistan Government ) బాయ్‌కాట్ చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌కు ( Bangladesh ) సపోర్ట్ గా తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని పాక్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ అంశంపై షాహిద్ అఫ్రిది సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “రాజకీయాలు మూసే తలుపులను క్రికెట్ తెరుస్తుంది అని నేను ఎప్పుడూ నమ్ముతాను. భారత్‌తో మ్యాచ్ ఆడకపోవడం బాధాకరం. అయినా ప్రభుత్వ నిర్ణయానికి నేను మద్దతు ఇస్తున్నాను. ఇప్పుడు ఐసీసీ మాటలతో కాదు, నిర్ణయాలతో న్యాయం చూపించాల్సిన సమయం ఇది” అని పేర్కొన్నాడు. 

అయితే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ( World Championship of Legends ) టోర్నమెంట్ లో భారత్, పాకిస్తాన్‌తో ఆడేందుకు నిరాకరించినప్పుడు కూడా షాహిద్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతానికి ఇరు దేశాల బోర్డుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకుంటుందా లేదా అన్నది ప్రశ్నగా మారింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola