Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్

Continues below advertisement

టీ20 వరల్డ్ కప్ 2026 ప్లేయింగ్ ఎలెవన్ నుంచి మొదట తనను పక్కన పెట్టినప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన ధైర్యాన్ని అసలు నమ్మలేకపోయానని టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ సంచలన విషయాలు వెల్లడించాడు. 

రోహిత్ చెప్పిన మాటలు, చూపించిన విజన్ ఆ సమయంలో తనకు అర్థం కాలేదని, అందుకే ఆయనకు   సారీ చెప్తున్నానని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. తుది జట్టులో చోటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన సంజూ, ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి బయటపడటానికి నాలుగైదు రోజులు పట్టిందని పేర్కొన్నాడు. ఆ సమయంలో సెల్ఫ్ రిఫ్లెక్షన్ ద్వారా తన మైండ్‌సెట్‌ను రీసెట్ చేసుకున్నట్లు చెప్పాడు.

ఈ కొత్త కోణంతోనే వెస్ట్ ఇండీస్‌తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడినట్లు వివరించాడు. రోహిత్ ఇచ్చిన ధర్యం ఎప్పటికి మర్చిపోలేనని అన్నాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత తను చేసిన ఎమోషనల్ సెలెబ్రేషన్ తన జీవితాంతం గుర్తుండిపోతుందని కేరళ బ్యాటర్ స్పష్టం చేశాడు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola