సంజూ.. చుక్కలు చూపించాల!
టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక గిల్ తప్పుకోవవడంతో ఇప్పుడు ఓపెనర్ ప్లేస్ ఖాళీగా మారింది. దీంతో 5వ టీ20 మ్యాచ్‌లో మరోసారి సంజూ శాంసన్‌కి ఫైనల్ లెవెన్లో ఛాన్స్ దొరకడంతో పాటు.. అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నిజానికి సంజూ 4వ టీ20లోనే బరిలోకి దిగాల్సింది. కానీ మ్యాచ్ రద్దు కావడంతో.. సంజూకు ఆ మ్యాచ్ ఆడే ఛాన్స్ లేకుండా పోయింది.
ఇక ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా ఇండియా, సఫారీల మధ్య 5వ టీ20 మ్యాచ్ జరగకుండగా.. ఈ మ్యాచ్‌లో మళ్లీ సంజూకు ఫైనల్ లెవెన్‌లో బరిలోకి దిగబోతున్నాడు. ఇదిలా ఉంటే.. చాలా రోజులుగా గిల్ కోసం గంభీర్.. సంజూని బెంచ్‌కే పరిమితం చేస్తున్నాడని, ఒకపక్క గిల్ వరుసగా ఫెయిల్ అవుతున్నా ఫైనల్ 11లో కంటిన్యూ చేస్తూ.. అద్భుతమైన ఓపెనర్ అయినప్పటికీ సంజూను మాత్రం బెంచ్‌కే పరిమితం చేసి అతడికి అన్యాయం చేస్తున్నాడంటూ హెడ్ కోచ్ గంభీర్‌ను క్రికెట్ ఫ్యాన్స్ విమరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు అవకాశం దొరకబోతుండటంతో ‘సంజూ.. ఈ మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించి.. సఫారీ బౌలర్లకే కాదు.. నిన్న డగౌట్‌లో కూర్చోబెట్టిన కోచ్ గంభీర్‌కి కూడా చుక్కలు చూపించాల’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.