Sanju Samson in KCL | KCL లో అదరగొడుతున్న సంజూ శాంసన్
ఆసియా కప్ 2025 కు ముందు సంజు శాంసన్ తన బ్యాట్టింగ్ తో ప్లేయింగ్ 11 లో తన ప్లేస్ ను ఖాయం చేసుకుంటున్నాడు. కేరళ క్రికెట్ లీగ్‌లో కొచ్చి బ్లూస్ తరపున ఆడుతూ తన సత్తా చాటుతున్నాడు. త్రిసూర్ టైటాన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో సంజూ రెచ్చిపోయాడు. ఓపెనర్‌గా వచ్చి 46 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ ఐదో ఓవర్‌లో సిజోమోన్ జోసెఫ్ వేసిన నో-బాల్‌ను సిక్స్ కొట్టాడు సంజూ... ఆ వెంటనే ఫ్రీ హిట్‌ను కూడా సిక్స్‌గా బాదాడు. నో-బాల్ పరుగుతో కలిపి ఒక్క బాల్ లోనే 13 పరుగులు అందించాడు. కేరళ క్రికెట్ లీగ్‌లో సంజు శాంసన్ దూకుడు మాములుగా లేదు. అయితే ఈ ఇంపాక్ట్ అంతాకూడా ఆసియా కప్ పై పడనుంది.
టీం ను ప్రకటించినప్పుడు అజిత్ అగార్కర్ మాట్లాడుతూ ఓపెనర్ గా శుబ్మన్ గిల్, అభిషేక్ శర్మ, లేదా సంజు శాంసన్ ... వీరిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అన్నారు. అలాగే అభిషేక్ శర్మను తప్పించడం కష్టం అని కూడా అన్నారు. సో కేరళ క్రికెట్ లీగ్ లో తన అద్భుత ప్రదర్శనతో ఓపెనర్ గా బర్త్ నాదే అంటూ సెలెక్టర్లకు గట్టి వార్నింగ్ ఇస్తున్నాడు సంజూ శాంసన్.