Sanju Samson about Opener Place | ఓపెనర్ ప్లేస్ సంజు రియాక్షన్ ఇదే

Continues below advertisement

ఓపెనర్ గా టీ20 లో శుబ్మన్ గిల్ వరుసగా విఫలమవుతున్నాడు. గిల్ కు ఎన్ని ఛాన్సులు ఇచ్చినా అదే ప్రదర్శన ఉండడంతో ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు. శుబ్మన్ గిల్ స్థానంలో సంజుకు ఛాన్స్ ఇవండీ అంటూ ఎన్నో ట్రోల్స్ కూడా చేసారు. దాంతో ఎవరు ఊహించని విధంగా బీసీసీఐ శుబ్మన్ గిల్ పేరును టీ20 వరల్డ్ కప్ టీమ్ లో చేర్చలేదు. 

సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 లో శుభమన్ గిల్ గాయం కారణంగా సంజుకి టీమ్ లో ఛాన్స్ దొరికింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత ఓపెనర్ స్లాట్‌పై ఇర్ఫాన్ పఠాన్ అడిగిన ప్రశ్నలకు సంజు శాంసన్ నవ్వుతూనే సమాధానం చెప్పకుండా దాటేశాడు.

“ముందు పెద్ద టోర్నమెంట్ ఉంది. నేను చాలా కాలంగా ఈ సిస్టమ్‌లోనే ఉన్నాను. కోచ్, కెప్టెన్ ఏం చేయాలని చూస్తున్నారో నాకు అర్థమవుతోంది. గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ తో కమ్యూనికేషన్ ఎప్పుడూ ఓపెన్‌గా ఉంటుంది” అని తెలిపాడు. అయితే, రాబోయే న్యూజిలాండ్ సిరీస్‌లో సంజు ఓపెనర్‌గా ఆడతావా? అని ఇర్ఫాన్ పఠాన్ అడగడంతో, సంజు ఒక్కసారిగా నవ్వేశాడు. “భయ్యా, మీరు ఒకే అనే నేను ఓపెన్ చేస్తా. నేను ఏమి చెప్పాలి చెప్పండి. ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు ఇర్ఫాన్ భాయ్” అంటూ సంజు నవ్వేశాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola