Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్

వెస్టిండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో టీమిండియాను ఒంటిచేత్తో సెమీఫైనల్‌కు చేర్చిన సంజూ శాంసన్ ( Sanju Samson ), మ్యాచ్ విజయం తర్వాత భావోద్వేగానికి లోనయ్యాడు. "ఈ ఇన్నింగ్స్ నా జీవితం.. నా ప్రపంచం" అంటూ సంజూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తను ఇంతటి గొప్ప ఇన్నింగ్స్ ఆడటం వెనుక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ వంటి ప్లేయర్స్ ఇన్స్పిరేషన్ ఉందని సంజూ తెలిపాడు. "గొప్ప ప్లేయర్స్ క్లిష్ట పరిస్థితుల్లో తమ ఆటను ఎలా మార్చుకుంటారో నేను చాలా ఏళ్లుగా గమనిస్తున్నాను. గత మ్యాచ్‌లో మొదటి బంతి నుంచే బాదిన నేను, ఈ మ్యాచ్‌లో పరిస్థితిని బట్టి ఆడాను. వికెట్లు పడుతున్న వేళ ఒత్తిడిని అధిగమించి ప్రెసెంట్ ఉండటమే నా సక్సెస్ మంత్రం" అని సంజూ వివరించాడు.

తన కెరీర్‌లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని, "నేను సాధించగలనా?" అని తనను తానే ప్రశ్నించుకున్న రోజులు ఉన్నాయని సంజూ గుర్తు చేసుకున్నాడు. కానీ, ఈడెన్ గార్డెన్స్‌లో 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో విధ్వంసం సృష్టించి, భారత్‌ను 5 వికెట్ల తేడాతో గెలిపించాడు. "ఈ రోజు నన్ను దీవించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు" అంటూ సంజూ చెప్పుకొచ్చాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola