Sanjay Manjrekar Demands Ban On Vaibhav | వైభవ్‌పై సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు

Continues below advertisement

టీమిండియా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక-ఏ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ఓటమి తర్వాత, తప్పుడుగా ప్రవర్తించిన లంక ప్లేయర్‌ను వైభవ్ నెట్టేయడం వివాదంగా మారింది. దీనిపై మంజ్రేకర్ ట్వీట్ చేస్తూ.. "నేనే గనుక కోచ్ అయితే వైభవ్‌ని అఫ్గానిస్థాన్ మ్యాచ్ నుండి పక్కన పెట్టేవాడిని, మైదానంలో భౌతిక గొడవలు అస్సలు ఒప్పుకోను" అంటూ క్లాస్ పీకాడు.

దీనిపై వైభవ్ కూడా గట్టిగానే స్పందించాడు. "మీ అనుభవాన్ని గౌరవిస్తాను, కానీ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న సగం వీడియో చూసి నన్ను జడ్జ్ చేయకండి" అని రిప్లై ఇచ్చాడు.

వైభవ్ కు ఫ్యాన్స్, మాజీ ప్లేయర్స్ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. చిన్న పిల్లాడి గురించి అని కామెంట్స్ అవసరం లేదు అని ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు అంత చిన్న ఏజ్ కి ఇంటర్నేషనల్ లెవెల్ లో సెట్ అవటానికి టైం పడుతుందని, టైం ఇస్తే మంచి రిజల్ట్ వస్తుందని నిపుణులు అంటున్నారు. "అతను ఇంకా ఎదుగుతున్నాడు, మీలాంటి సీనియర్లే ఇలా మెచ్యూరిటీ లేకుండా మాట్లాడితే ఎలా?" అంటూ మంజ్రేకర్‌కి కౌంటర్ ఇచ్చారు గవాస్కర్. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola