Salman Agha on Shake Hand Controversy | Asia Cup Final 2025 | భారత్ తో మ్యాచ్ అంటే ఒత్తిడే

ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న షేక్ హ్యాండ్ వివాదంపై పీసీబీ... ఐసీసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కానీ ఐసీసీ పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాత సూపర్-4 మ్యాచ్‌లో కూడా పాక్ ఆటగాళ్లకు టీమ్ ఇండియా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇక ఫైనల్లో పాక్, భారత్ ముచ్చటగా మూడోసారి తలపడనున్నారు. ఈ నేపథ్యంలో షేక్ హ్యాండ్ వివాదంపై పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందించాడు. 

'అండర్ 16 నుంచి క్రికెట్ ఆడుతున్నాను. రెండు జట్లు షేక్ హ్యాండ్ చేసుకోకపోవడం నేను ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి ఘటన ఒకటి జరిగిందని కూడా వినలేదు. గతంలో కూడా భారత్, పాకిస్థాన్ మధ్య ఇప్పుడున్న దానికంటే దారుణమైన పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగాయి. అప్పుడు కూడా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ చేసుకున్నారు. ఇది క్రికెట్‌కు ఏ మాత్రం మంచిది కాదనినా వ్యక్తిగత అభిప్రాయం' అని సల్మాన్ అలీ అఘా పేర్కొన్నాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola